ఏడో అతిపెద్ద ఆయుధ ఎగుమతిదారుగా ఇజ్రాయెల్
ఆయుధ ఎగుమతుల్లో బ్రిటన్‌ను వెనక్కి నెట్టి ఇజ్రాయెల్ ఏడో స్థానంలో నిలిచింది. ఇజ్రాయెల్ తన మొత్తం ఆయుధ ఎగుమతుల్లో 56 శాతం భారత్‌కు ఎక్స్‌పోర్ట్ చేస్తోంది. ఆ తర్వాత జర్మనీకి 21 శాతం, అమెరికాకు 7.8 శాతం ఆయుధాలను పంపిస్తుంది. ఆయుధాలు ఎగుమతి చేసే జాబితాలో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. ఫ్రాన్స్, రష్యా, జర్మనీ, చైనా, ఇటలీలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.