సందీప్ రెడ్డి వంగాతో నాగార్జున, RGV ఇంటర్వ్యూ

అక్కినేని నాగార్జున, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేష‌న్‌లో వచ్చిన ఐకానిక్ చిత్రం 'శివ'. ఈ సినిమా ఈనెల 14న 4K వెర్షన్‌లో గ్రాండ్‌గా రీరిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి నాగార్జున, RGVలు 'శివ' సినిమాకు సంబంధించిన విషయాలను పంచుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.