ఏటూరునాగారంలో దంచికొట్టిన వర్షం

MLG: ఏటూరునాగారంతో పాటు పరిసర ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం దంచికొట్టింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం వర్షానికి తడవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులను వారు కోరుతున్నారు.