VIDEO: ‘సింగుపురం PHCకు కొత్త భవనం మంజూరు చేయాలి’
SKLM: సింగుపురం PHCకు కొత్త భవనం మంజూరు చేయాలని శ్రీకాకుళం MLA శంకర్ కోరారు. అసెంబ్లీలో బుధవారం మాట్లాడుతూ.. శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే ఉన్న 9 సూపర్ స్పెషాలిటీ విభాగాలకు అదనంగా మరో మూడు విభాగాలు మంజూరు చేయాలని, రిమ్స్ను 930 పడకలకు అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో అవసరమైన సిబ్బంది, మౌలిక సదుపాయాలు పెంచాలని కోరారు.