వేసవి విజ్ఞాన శిబిరాలు వినియోగించుకోవాలి

VZM: ఈ నెల 28 నుంచి జూన్ 6 వరకు రామభద్రపురం శాఖా గ్రంథాలయం ద్వారా నిర్వహించే వేసవి విజ్ఞాన శిబిరాలను వినియోగించుకోవాలని MEO తిరుమల ప్రసాద్ శనివారం సూచించారు. గ్రంథాలయ శాఖ ఆదేశాలతో ఈ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. వేసవిలో విద్యార్థులు ఆటవిడుపు కాకుండా ఉండేందుకు కథలు, స్పోకెన్ ఇంగ్లిష్, క్విజ్, డ్రాయింగ్, కారమ్స్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు.