మణుగూరు ఆర్టీసీ సమ్మెలో ఉద్రిక్తత
BDK: మణుగూరు ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మె ఉద్రిక్తతకు దారితీసింది. బస్సులను అడ్డుకునేందుకు కార్మికులు ప్రయత్నించగా, పోలీసులు వారిని నిలువరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ నాగబాబు హెచ్చరించారు. తెల్లవారుజాము నుంచే పోలీసులు భారీగా మోహరించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులను సజావుగా నడిపేందుకు అధికారులు భద్రత ఏర్పాటు చేశారు.