'బందరు హల్వా' ఎప్పుడైనా తిన్నారా..?

'బందరు హల్వా' ఎప్పుడైనా తిన్నారా..?

కృష్ణా: 'బందరు హల్వా' మచిలీపట్నం ప్రాంతానికి చెందిన సాంప్రదాయ మిఠాయి. ఇది దేశ వ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉంది. ఈ హల్వా జెల్లీలాంటి టెక్స్చర్, రుచి కారణంగా చాలా ప్రసిద్ధి చెందింది. దీపావళి, ఉగాది, సంక్రాంతి పండుగల సమయంలో ఎక్కువగా తయారు చేస్తారు. ఇది కేవలం మిఠాయి కాదు, మచిలీపట్నం స్థానిక సంప్రదాయానికి చిహ్నం. ఇక ఈ హల్వా తింటే రప్ప రప్ప అనాల్సిందే.