మేడారం జాతరకు వచ్చే భక్తులకు శుభవార్త..!
KMM: ప్రభుత్వం మేడారం జాతరకు వచ్చే భక్తులకు శుభవార్త అందించింది. మేడారం జాతర సందర్భంగా హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భక్తుల సౌకర్యార్థం పడిగాపూర్ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ నిర్వహించనున్నారు. ఈ రైడ్స్ ద్వారా భక్తులు సుమారు 6 నుంచి 7 నిమిషాల పాటు మేడారం జాతరను విహంగ వీక్షణం చేసే అవకాశం ఉంటుంది.