పాప ఆచూకీ తెలిసినవారు సంప్రదించండి: ఎస్సై

NDL: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన 8ఏళ్ల చిన్నారి వాసంతి ఆదివారం మధ్యాహ్నం ఆడుకోవడానికి బయటికి వెళ్లింది. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ముచ్చుమర్రి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని పాప కోసం గాలిస్తున్నారు. పాప ఆచూకీ తెలిసినవారు పోలీసుస్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై జయశేఖర్ కోరారు.