పామర్రులో వైసీపీ నేతల సమావేశం

పామర్రులో వైసీపీ నేతల సమావేశం

కృష్ణా: పామర్రులో రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నాయకులతో సమావేశమై పామర్రు నియోజకవర్గ రైతుల సమస్యలపై చర్చించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను పక్కన పెట్టిందని, రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైసీపీ పాలనలో రైతులకు నాణ్యమైన విత్తనాలు, గిట్టుబాటు ధర, రైతు భరోసా కేంద్రాలు ఉండేవన్నారు.