సూర్యాపేట మున్సిపల్ బరిలో జనసేన పోటీ
SRPT: రానున్న సూర్యాపేట మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ గట్టి పోటీ ఇవ్వనుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు బరిలోకి దిగుతున్నట్లు నియోజకవర్గ ప్రతినిధి రామగిరి శివసాయి వెల్లడించారు. గత సర్పంచ్ ఎన్నికల ఫలితాల స్ఫూర్తితో, జిల్లా నాయకత్వ మార్గదర్శకత్వంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ.. మున్సిపాలిటీలో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.