కేంద్ర ప్రభుత్వ పథకం కింద రూ.20వేలు సాయం
MBNR: జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) ద్వారా ఆదుకుంటున్నట్లు ఎంపీడీవో విజయ్ తెలిపారు. 2023, ఏప్రిల్ 1 తర్వాత కుటుంబ యజమాని మరణిస్తే రూ.20 వేల సాయం ఒకేసారి అందుతుందన్నారు. మృతుని వయసు 18-59 ఏళ్ల మధ్య ఉండాలి. దరఖాస్తు కోసం రేషన్ కార్డు, మరణ, ఆదాయ ధ్రువపత్రాలు అవసరమని చెప్పారు. అర్హులైన వారు మీసేవలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు.