కవి బండ్ల మాధవరావుకు 'సాహితీ ప్రతిభా పురస్కారం'
GNTR: ఒంగోలు కళామిత్ర మండలి వారి 'కొంపల్లి బాలకృష్ణ స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం' ప్రముఖ కవి బండ్ల మాధవరావుకు లభించింది. తుళ్లూరు మండలం అనంతవరంకు చెందిన ఆయనకు నవంబర్ 2న ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ పురస్కారాన్ని అందజేస్తారని కళామిత్ర మండలి జాతీయ అధ్యక్షుడు డా. నూనె అంకమ్మరావు మంగళవారం తెలిపారు.