నామినేషన్ వేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

నామినేషన్ వేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త..!

MHBD: మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. బరిలో నిలిచే అభ్యర్థులు పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నెల 28న నామినేషన్ దాఖల ప్రక్రియ ప్రారంభమై, 30న ముగుస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నియమ నిబంధనలు పాటించడం తప్పనిసరి. నామినేషన్ పత్రాలు దాఖలు చేసేటప్పుడు ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. నిర్లక్ష్యం చేస్తే తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంది.