బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించండి : నరేందర్ రెడ్డి
NRPT: మద్దూరు మండలంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నందిపాడ్, పల్లెర్ల, లక్కయపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున ప్రచారంలో సోమవారం పాల్గొన్నారు. గ్రామస్థులను కలిసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.