ప్రాజెక్టుల పరిసరాల వద్దకు వెళ్ళవద్దు: కలెక్టర్

ప్రాజెక్టుల పరిసరాల వద్దకు వెళ్ళవద్దు: కలెక్టర్

NRML: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల పరిసరాలకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం ప్రకటనలో హెచ్చరించారు. నదీ పరివాహక ప్రాంతాలు, వాగులు, లోతట్టు ప్రదేశాలు దూరంగా ఉండాలని సూచించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా కంట్రోల్ రూమ్ నంబర్ 91005 77132 ను సంప్రదించాలని సూచించారు.