100% తో విజయ దుంధుభీ మోగించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని గ్రామీణాల్లో ఉన్న 59 పాఠశాలల్లో తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నాయకుల ఆధ్వర్యంలో 100% విద్యా కమిటీల్లో ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్‌లుగా ఎన్నికయ్యారు. గిద్దలూరు మండలంలోని ప్రతీ పాఠశాలలో మెరుగైన విద్య, పౌష్టిక ఆహారాన్ని విద్యార్థులకు అందించే విధంగా కృషి చేస్తామని గిద్దలూరు మండల తెదేపా అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి తెలిపారు.