బీహార్ విజయంపై ఎన్డీయే నేతల్లో సెలబ్రేషన్స్
VSP: బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే ఘన విజయాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు విశాఖలో శుక్రవారం బీజేపీ నేతలతో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కూటమి ఎంపీలు పరస్పరం స్వీట్లు తినిపించుకుని ఆనందం వ్యక్తపరిచారు.