బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి పోస్టరు ఆవిష్కరించిన ఎమ్మెల్యే
KNR: కరీంనగర్ జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం శుక్రవారం ఆవిష్కరించారు. 5న సివిల్ హాస్పిటల్ సమీపంలోని జగ్జీవన్ రామ్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు, దళిత సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.