గుంటూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైలు

GNTR: ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్-కొల్లాం-హైదరాబాద్ మధ్య నడిచే ప్రత్యేక రైలును గుంటూరు, తిరుపతి మీదుగా నడుపుతున్నట్లు మండల రైల్వే అధికారి గురువారం తెలిపారు. ఆగస్టు 16వ తేదీ నుంచి అక్టోబరు 11వ తేదీ వరకు ప్రతి శనివారం ఈ రైలు(07193) హైదరాబాద్‌లో 23.10 గంటలకు బయలుదేరుతుంది.