కదిరిదేవరపల్లి-తిరుపతి ప్యాసింజర్ రైలు రద్దు

కదిరిదేవరపల్లి-తిరుపతి ప్యాసింజర్ రైలు రద్దు

ATP: కదిరిదేవరపల్లి నుంచి గుంతకల్లు మీదుగా తిరుపతికి ప్రతిరోజూ నడిచే ప్యాసింజర్ రైలును డిసెంబర్ 17న పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ ధర్మతేజ తెలిపారు. రాయదుర్గం, సోమలాపురం మధ్యన కొత్తగా రైల్వే పనులు జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన మంగళవారం ప్రకటించారు. ప్రయాణీకులు గమనించాలని కోరారు.