'కలెక్టర్ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు'

'కలెక్టర్ ఆదేశాలు ధిక్కరిస్తే కఠిన చర్యలు'

అన్నమయ్య: జిల్లా కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించిన వారిపై కఠిన చర్యలు తప్పవని రాజంపేట సబ్ కలెక్టర్ భావన తెలిపారు. గతవారం కలెక్టర్ రైతులు, దళారులతో నిర్వహించిన సమావేశంలో బొప్పాయి టన్ను రూ.9 వేలు కేటాయించడం జరిగిందన్నారు. ఆగస్టు 15 తేదీ వరకు కచ్చితంగా నిర్ణయించిన ధరలకే రైతులకు ఇవ్వాలని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఆదేశాలు అతిక్రమిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్నారు.