నా దగ్గర బంగారం, వెండి లేవు: ఉదయనిధి స్టాలిన్
చెన్నైలోని చేపాక్కం-తిరువల్లికేణి డీఎంకే అభ్యర్థిగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తన దగ్గర బంగారం, వెండి వంటి విలువైన వస్తువులేవీ లేవని తెలిపారు. తన వద్ద రూ.50 వేలు, తన సతీమణి కిరుత్తికా వద్ద రూ.75 వేలు నగదు ఉన్నాయని పేర్కొన్నారు. తన చరాస్తి మొత్తం విలువ రూ.12,92,07,483గా వెల్లడించారు.