బాల్యం నుంచే విద్యార్థులకు ప్లాస్టిక్ అనర్థాలపై అవగాహన
SDPT: బాల్యం నుంచే పిల్లలకు ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రీత్ కుమార్ అన్నారు. ఇవాళ సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. బాల్యం నుంచే పట్టణ పరిశుభ్రత, పర్యావరణాన్ని కాపాడుకోవాలన్నారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.