కాంగ్రెస్ పార్టీలో చేరిన గూడూరు సర్పంచ్
MBNR: చిన్న చింతకుంట మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన సర్పంచ్ భీమన్న గౌడ్, గ్రామ బీఆర్ఎస్ యువజన నాయకుడు వినయ్ కుమార్ గౌడ్, పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.