జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి గజ్వేల్ విద్యార్థి ఎంపిక

జాతీయ ఫుట్‌బాల్ టోర్నీకి గజ్వేల్ విద్యార్థి ఎంపిక

SDPT: SGF జాతీయ స్థాయి ఫుట్‌బాల్ క్రీడలకు గజ్వేల్‌కు చెందిన హర్షవర్ధన్ అనే విద్యార్థి ఎంపికయ్యాడు. వికారాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్-14 ఫుట్‌బాల్ టోర్నీలో ప్రజ్ఞాపూర్ విద్యార్థి అయిన హర్షవర్ధన్ అద్భుత ప్రతిభకనబరిచాడు. చివరి మ్యాచ్‌లో నిజామాబాద్‌పై గోల్ చేసి మెదక్ జట్టును గెలిపించాడు. ఈ ప్రతిభతో హర్షవర్ధన్ జాతీయస్థాయి టోర్నమెంట్‌కు సెలక్ట్ అయ్యాడు.