భారత్‌కు మరో ఐదు S-400లు!
పశ్చిమాసియాలో యుద్ధం వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి మరో ఐదు S-400 గగనతల రక్షణ వ్యవస్థను కొనుగోలు చేయడానికి డిఫెన్స్ ప్రొక్యూర్‌మెంట్ బోర్డ్(డీపీబీ) ఆమోదం తెలిపింది. ప్రస్తుతం భారత్ వద్ద 3 S-400 వ్యవస్థలు ఉండగా.. మరో రెండు ఈ ఏడాది భారత సాయుధ దళాలకు అందనున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ క్షిపణులను S-400 వ్యవస్థ నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.