VIDEO: భూ వివాదంలో బావపై బావమరది దాడి
WGL: భూ వివాదం నేపథ్యంలో బావమరది తన అక్క, బావలపై కత్తులతో దాడి చేసిన ఘటన సోమవారం నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్డులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో బావ సొప్పరి ఓదేలు తలకు తీవ్ర గాయాలు కాగా, అక్క అరుణకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాధితులను ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు అరుణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.