VIDEO: మండలంలో కురుస్తున్న వర్షం
ఆదిలాబాద్ రూరల్ మండలంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షం పడుతుంది. మండలంలోని అంకోలి, తంతోలి, లోకారి, వన్వాట్, అంకాపూర్, చించుఘాట్ తదితర గ్రామాల్లో వర్షం పడుతోంది. ఉదయం ఆకాశం ఒక్కసారిగా మేఘావృతమై కురిసిన ఈ వర్షం రైతుల ముఖాల్లో చిరునవ్వు తెచ్చింది. తమ పంటలకు ఈ వర్షం కాస్త మేలు చేస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.