VIDEO: ఆగస్తీశ్వర స్వామి ఆలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ట
CTR: పుంగనూరు మండలం నెక్కుంది గ్రామం కొండపై ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజల్లుతున్న శ్రీ ఆగస్తీశ్వర స్వామి ఆలయంలో నూతన ధ్వజ స్తంభ ప్రతిష్టాపన జరిగింది. ఆదివారం దేవాలయ ఆవరణంలో ధ్వజస్తంభాన్ని నిలబెట్టారు. తర్వాత మంజునాథ దీక్షితులు శైవాగమొక్తంగా ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ఈ నెల 10న మంగళవారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.