‘AI అసిస్టెంట్’ను రూపొందించిన సింహాద్రిపురం వాసి

KDP: సింహాద్రిపురం మండలం జంగంరెడ్డి పల్లెకు చెందిన ధనుంజయ రెడ్డి 'బిట్టు AI అసిస్టెంట్'ను రూపొందించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే సాంకేతిక రంగంలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నానన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వాయిస్ రికార్డు కంట్రోల్, ఇంటర్నెట్ సమాచారాన్ని సేకరించి సహజ భాషలో సమాధానం లభిస్తుందన్నారు.