VIDEO: నూతన అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన MLA

VIDEO: నూతన అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన MLA

CTR: పలమనేరు ఏరియా ఆసుపత్రిలో సోమవారం నూతన అంబులెన్స్ సర్వీస్ వాహనాన్ని పలమనేరు MLA యన్.అమరనాథ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబులెన్స్‌లో నూతన వైద్య సదుపాయాలు ఉన్నాయని, సర్వీస్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.