కోటితీర్థంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం

NLR: చేజర్ల మండల వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్.సుజాత యనమదల కోటితీర్థం గ్రామాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. అధిక దిగుబడులు సాధించాలంటే యాజమాన్య పద్ధతులు పాటించాలని, పంట నమోదు (ఈ-క్రాప్) తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించారు. వరి పంటలో జింకు లోపానికి నివారణ చర్యలు తెలిపారు.