జిల్లాలో 30డీ పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

NRML: జిల్లా వ్యాప్తంగా నేటి నుండి మే 31 వరకు 30డీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల శుక్రవారం ప్రకటనలో తెలిపారు. పోలీసు ఉన్నతాధికారుల నుండి అనుమతి లేకుండా పబ్లిక్ మీటింగ్‌లు, ఊరేగింపులు జరపరాదని, నిషేధిత ఆయుధాలను వాడరాదని తెలిపారు. నియమాలు ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు.