VIDEO: బీఆర్ఎస్ నేతలపై ఎలక్షన్ కోడ్ ఉల్లంఘన కేసు
MHBD: తొర్రూరు పట్టణంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి, పోలీసుల విధులను ఆటంకపరిచి, ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శుక్రవారం కేసు నమోదయింది. ఈ ఘటనలో బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి దయాకర్ రావు, అతని అనుచరులు పసమర్తి సీతారాములు, మంగళపల్లి శ్రీనివాస్, పల్లా సుందర్ రావు, తదితరులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.