మూసీకి జలకళ.. 642.5 అడుగులకు పెరిగిన నీటిమట్టం

NLG: నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ నీటిమట్టం రోజురోజుకూ పెరుగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాలైన రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు, ఎగువ కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకల ద్వారా వరదనీరు వచ్చి చేరుతోంది. ఈ ఏడాది వానాకాలం ప్రారంభం నుంచే మూసీ ప్రాజెక్టు జలాశయం నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. సోమవారం రాత్రి వరకు 642.5 అడుగులకు పెరిగింది.