టవర్ సర్కిల్ వద్ద అవగాహన కార్యక్రమం
JGL: ఫైర్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్ విభాగం ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా జగిత్యాల టవర్ సర్కిల్ వద్ద అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కృష్ణకాంత్ మాట్లాడుతూ.. గ్యాస్ లీకేజీలు, ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపారు. ఇళ్లలో ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు ఉంచుకోవాలని సూచించారు.