ఈనెల 6న వాహనాల వేలం పాట

ఈనెల 6న వాహనాల వేలం పాట

NRML: జిల్లాలో వివిధ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈనెల 6 గురువారం నిర్మల్ పట్టణ ఎక్సైజ్ కార్యాలయంలో వాహనాల వేలం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి అబ్దుల్ రజాక్ మంగళవారం తెలిపారు. 25 వాహనాలకు వేలం నిర్వహించడం జరుగుతుందని ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.