VIDEO: కేడీసీసీ బ్యాంకు వద్ద ఉద్యోగులు నిరసన
కృష్ణా: ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ల ఐక్యవేదిక (జేఏసీ) పిలుపు మేరకు సహకార సంఘాల ఉద్యోగులు సోమవారం మొవ్వ మండలంలోని కేడీసీసీ బ్యాంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ.. బ్రాంచ్ మేనేజర్ సుధీర్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బ్రాంచ్ కార్యాలయం ముందు ప్లకార్డులతో కూర్చుని నిరసన తెలియజేశారు.