బయ్యారం మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

బయ్యారం మండలంలో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే

BDK: బయ్యారం మండలంలో ఇల్లందు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ శనివారం సుడిగాలి పర్యటన చేశారు. ఈ పర్యటనలో భాగంగా మండల కేంద్రంలో ఇటీవల అకాల వర్షంతో నేలకొరిగిన వరి పంటను పరిశీలించారు. అలాగే ఇస్లాపురం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు ఐలయ్య తల్లి ఇటీవలే మరణించగా వారి కుటుంబాన్ని పరామర్శించారు.