ప్రయోగాత్మక ప్రాజెక్టు.. గూగుల్ నిర్ణయం

HYD: నగరంలో హైటెక్ పాలనను అందించడంపై జీహెచ్ఎంసీ దృష్టి పెట్టింది. గూగుల్ ప్రతినిధులు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణనతో సమావేశమయ్యారు. సచివాలయం నుంచి పురపాలకశాఖ కార్యదర్శి ఇలంబర్తి గూగుల్ మీట్ ద్వారా సమావేశంలో పాల్గొని ఏఐ ఆధారిత సాంకేతికతపై చర్చించారు. జెనరేటివ్-ఏఐ ఆధ్వర్యంలో ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టేందుకు పురపాలకశాఖ, జీహెచ్ఎంసీ, గూగుల్ నిర్ణయం తీసుకుందన్నారు.