VIDEO: ఇల్లు దగ్ధం.. రూ.2 లక్షల ఆస్తి నష్టం
JN: పాలకుర్తి మండలం గూడూరు గ్రామం శివారు నర్సింగాపురం తండాలో శనివారం కేతావత్ యాకూబ్ ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ఇల్లు కాలిపోవడంతో కుటుంబం వద్ద కట్టుబట్టలు తప్ప మరేమీ మిగల్లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.