ఒంటిమిట్టలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఉదయం 9:30-10:15 గం.కు ధ్వజారోహణం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గం.కు ప్రత్యేక కవి సమ్మేళనం ఉండనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాత్రి 7:00 గంటలకు స్వామివారు శేష వాహన సేవలో భక్తులకు దర్శనమిస్తారు. అయితే, ఏప్రిల్ 1న వెన్నెల వెలుగులో జరిగే సీతారామ కల్యాణం ఈ ఉత్సవాల్లో ప్రధాన ఘట్టం.