స్వచ్ఛ ఏపీ మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా కదిరి వాసి

స్వచ్ఛ ఏపీ మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా కదిరి వాసి

సత్యసాయి: కదిరి ప్రాంతానికి చెందిన పర్వీన్ భానుని స్వచ్ఛ ఏపీ మిషన్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నియామకంపై ఆమె సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటరమణలకు కృతజ్ఞతలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా స్థానికులు, నాయకులు, బంధుమిత్రులు పర్వీన్ భానుకు శుభాకాంక్షలు తెలియజేశారు.