'రహదారుల నిర్మాణానికి సహకరించండి'
కోనసీమ: అమలాపురం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణకు నడుము కట్టానని ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. దీనిలో భాగంగా రెండు నిర్మాణాలు చేపట్టాను. మరో 5 వంతెనలకు వచ్చే వేసవిలో శంకుస్థాపన చేయనున్నట్లు ఆర్&బి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే వివరించారు. శనివారం సెక్రటేరియట్‌లో మంత్రిని కలిసి పలు రోడ్ల నిర్మాణానికి తనకు సహకరించాలని కోరారు.