స్వదేశీ జాగరణ మంచ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
VZM: స్వదేశీ జాగరణ మంచ్ విజయనగరం ఆధ్వర్యంలో శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. బాలాజీ కూడలి వద్ద మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య సంయోజన స్వదేశీ ప్రముఖ్, కర్ణాటక యూనివర్సిటీ ప్రొఫెసర్ డా. లింగరాజు మాట్లాడుతూ.. విదేశీ వస్తువులను బహిష్కరణ చెయ్యాలన్నారు. స్వదేశీ వస్తువులను వాడి మన దేశ సంపద కాపాడి, రైతులకు అండగా ఉండాలన్నారు.