రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

MHBD: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, గౌరవ భావాలను పెంపొందిస్తాయని మానుకోట MLA భూక్య మురళినాయక్ అన్నారు. పట్టణంలోని ఫాతిమా హైస్కూల్‌లో జరుగుతున్న 19వ CSA రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలకు MLA ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు క్రీడాస్ఫూర్తిని జీవితాంతం కొనసాగించాలని ఆయన సూచించారు.