నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థల పరిశీలన

BDK: కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పసుపులేటి వీరబాబుని దమ్మపేట మండలం మున్నూరుకాపు పెద్దలు మర్యాదపూర్వకంగా సన్మానించారు. దమ్మపేటలో నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థలమును పరిశీలించడం జరిగింది. నూతన గ్రంథాలయ భవన నిర్మాణ దాత చెక్కిరాల రమేష్‌ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రంథపాలకురాలు బి. వాణి పెద్దలు పాల్గొన్నారు.