స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కార్మికుల ఆందోళన
AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు అడ్మిన్ బిల్డింగ్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో స్టీల్‌ప్లాంట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఉత్పత్తి లక్ష్యాలను బట్టి జీతాలు చెల్లిస్తామనే సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తమ నిరసనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.