డీఎస్సీలో విజయం సాదించిన కానిస్టేబుల్

సత్యసాయి: సోమందేపల్లి మండలానికి చెందిన కానిస్టేబుల్ నరేశ్ డీఎస్సీ ఫలితాల్లో స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపిక కావడం విశేషం. ఇయన 2013లో కానిస్టేబుల్గా ఎంపికై పెనుకొండ స్టేషన్లో పనిచేశారు. ప్రస్తుతం సోమందేపల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూనే బీఈడీ పూర్తి చేశారు. గతంలో రెండు సార్లు విఫలమైనా ఈసారి కృషితో విజయాన్ని సాధించారు.